Video Of Day

Breaking News

మే 2 ఎంసెట్ ర్యాంకులు

ఆంధ్రప్రదేశ్ లోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఎంసెట్‌ - 2018 ర్యాంకులను మే 2 (బుధవారం)న విడుదల చేయనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ర్యాంకులను వెల్లడించనున్నారు. ఏప్రిల్ 21 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ర్యాంకులను విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ ఫోన్లకు కూడా మెసేజ్ ద్వరా పంపుతామని ఎంసెట్‌ కన్వీనర్‌ సాయిబాబు తెలిపారు. 

No comments