Video Of Day

Breaking News

ఎన్టీపీసీలో డిప్లొమా ఇంజనీర్ల నోటిఫికేషన్

దేశంలో నాలుగో వంతు విద్యుత్ అవసరాలను తీర్చుతున్న భారతదేశపు అతిపెద్ద విద్యుత్తు సంస్థ ఎన్టీపీసీ లిమిటెడ్. దీని సదరన్ రీజియన్ ఆధ్వర్యంలోని తెలంగాణలోని రామగుండం, ఆంధ్రప్రదేశ్లోని సింహాద్రి ప్రాజెక్టుల్లో ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్/ ఇన్ స్ట్రుమెంటేషన్ లో డిప్లొమా ట్రెయినీ ఉద్యోగం కోసం దరఖాస్తులు కోరుతోంది. 

అర్హతలు: 70శాతం మార్కులతో ఫుల్ టైం ఇంజనీరింగ్ డిప్లొమా. 2017లో ఉత్తీర్ణులైన వారు, 2018లో చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 25 సంవత్సరాలు
దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వరా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులకు చివరి తేది: 09-05-2018

వివరాలకు www.ntpccarees.net ను చూడొచ్చు.

No comments