ఆరు రోజుల్లో టెట్ నోటిఫికేషన్! జూలై 6న డీఎస్సీ! ఏపీలో పండగే!
ఆంధ్రప్రదేశ్ లో జూలై 6న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీ మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం. తెలిపారు. మొత్తం 10,351 పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏపీపీఎస్సీ ద్వారా డీఎస్సీ నిర్వహించాలని భావిస్తున్నామని వెల్లడించారు. ఈ డీఎస్సీని ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మే 4న టెట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. టెట్ అభ్యర్థులకు మాక్ టెస్టులు నిర్వహిస్తామని వెల్లడించారు. వారం రోజుల్లోగా డీఎస్సీ, టెట్ సిలబస్‌ను ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు.
టెట్ షెడ్యూల్:
మే 4న టెట్ నోటిఫికేషన్
మే 5 నుంచి మే 22 వరకూ ఫీజు చెల్లింపు గడువు
మే 5 నుంచి మే 23 వరకూ దరఖాస్తు సమయం
మే 25 నుంచి మాక్ టెస్టులు
జూన్ 3 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్
జూన్ 10 నుంచి ఆన్లైన్లో పరీక్షలు
డీఎస్సీ షెడ్యూల్:
జులై 6న డీఎస్సీ నోటిఫికేషన్
జులై 6 నుంచి ఆగస్టు 8 వరకూ ఫీజు చెల్లింపు గడువు
జులై 7 నుంచి ఆగస్టు 9 వరకూ దరఖాస్తుకు సమయం
ఆగస్టు 1 నుంచి ఆన్లైన్లో మాక్‌టెస్టులు
ఆగస్టు 15 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్
ఆగస్టు 23 నుంచి ఆగస్టు 30 వరకు డీఎస్సీ పరీక్షలు
No comments