Video Of Day

Breaking News

పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఆదివారం(ఏప్రిల్ 29) వెలువడ్డాయి. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 6,17,484 మంది ఈ పరీక్షలు రాశారు. వీరిలో 94.48శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలురు 94.41శాతం, బాలికలు 94.56 శాతం మంది ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పరీక్షలు ముగిసిన నెలరోజుల్లోనే ఫలితాల విడుదలకు కృషి చేసిన అధికారులను అభినందించారు. గతేడాది కంటే ఈ ఏడాది ఫలితాలు ముందుగానే విడుదల చేసినట్లు చెప్పారు. పది ఫలితాల్లో ప్రకాశం జిల్లా 97.93శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా, నెల్లూరు జిల్లా 80.37 శాతంతో చివరి స్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. ఫలితాలను కింది లింక్ ను క్లిక్ చేయండి.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

No comments