Video Of Day

Breaking News

డిగ్రీ అభ్యర్థులకు సువర్ణావకాశం! సీఏపీఎఫ్‌లో 380 పోస్టులు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ)... కేంద్ర సైనిక పోలీస్‌ దళ్‌(సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌–సీఏఎస్‌ఎఫ్‌)ల్లో 398 అసిస్టెంట్‌ కమాండెంట్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాతపరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వూ్యలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేస్తుంది. డిగ్రీ అర్హతతో కేంద్ర పోలీస్‌ దళాల్లో చేరడం ద్వారా  దేశ సేవతోపాటు ఉజ్వల కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు.  

పోస్టుల వివరాలు: 389

  • బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌): 60
  • సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌): 179
  • సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్సెస్‌(సీఐఎస్‌ఎఫ్‌): 84
  • ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ): 46
  • శస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ): 29

అర్హతలు:

  • ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనల్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • వయసు: ఆగస్టు1, 2018 నాటికి 20 నుంచి 25ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ట వయో సడలింపు ఉంటుంది. 
  • అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాలు పురుష, మహిళ అభ్యర్థులు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.  


దరఖాస్తు విధానం:
సంబంధిత అర్హతలు కలిగిన అభ్యర్థులు https://upsconline.nic.in/
ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.200. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


ఎంపిక ప్రక్రియ:
సెంట్రల్‌ ఆర్మడ్‌ పోలీస్‌ ఫోలీస్‌ ఫోర్సెస్‌లో.. అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో
రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో అర్హులైన అభ్యర్థులకు రెండో దశలో ఫిజికల్‌ స్టాండర్డ్స్‌/ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్‌లకు ఆహ్వానిస్తారు. ఈ రెండో దశ కూడ దాటిన వారికి ఇంటర్వూ్య/పర్సనాలిటీ టెస్ట్‌ నిర్వహిస్తారు.

ముఖ్య తేదీలు:

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 25 ఏప్రిల్, 2018
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 21 మే, 2018
  • రాత పరీక్ష : ఆగస్టు 12, 2018



పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ https://upsconline.nic.in/ చూడొచ్చు.


No comments