Video Of Day

Breaking News

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2000 పీవో పోస్టులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్.బి.ఐ).. భారీసంఖ్యలో ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసింది.  దేశవ్యాప్తంగా 2000 పీవో (ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌) పోస్టుల భ‌ర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. సుస్థిర కెరీర్‌కు కేరాఫ్ అడ్రస్గా నిలిచే బ్యాంకింగ్‌ రంగంలో.. ఎస్‌బీఐలో ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉంటుంది. ఈ పోస్టుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే...

పోస్టుల వివ‌రాలు:

  • పీవో (ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌): 2000 పోస్టులు 

        (ఎస్సీ-300, ఎస్టీ-150, ఓబీసీ-540, జ‌న‌ర‌ల్‌-1010)

అర్హత‌: ఏదైనా డిగ్రీ. డిగ్రీ చివ‌రి సంవ‌త్సరం/ సెమిస్టర్ చ‌దువుతున్నారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు.

వ‌య‌సు: 01.04.2018 నాటికి 21 - 30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు అయిదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్ల గ‌రిష్ఠ వ‌య‌సు మిన‌హాయింపు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రిలిమిన‌రీ, మెయిన్ ఆన్‌లైన్ ప‌రీక్షలు, గ్రూప్ డిస్కషన్, ఇంట‌ర్వ్యూ ద్వారా..


  • ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 13.05.2018 
  • కాల్ లెట‌ర్‌ డౌన్‌లోడ్ (ప్రిలిమిన‌రీ ప‌రీక్ష): 18.06.2018 నుంచి
  • ఆన్‌లైన్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేది: జులై 01, 07, 08 తేదీల్లో
  • ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు: 15.07.2018
  • కాల్ లెట‌ర్‌ డౌన్‌లోడ్ (మెయిన్‌ ప‌రీక్ష): 20.07.2018 నుంచి.
  • ఆన్‌లైన్ మెయిన్‌ ప‌రీక్ష తేది: 04.08.2018.
  • మెయిన్‌ ప‌రీక్ష ఫ‌లితాలు: 20.08.2018.
  • ఇంట‌ర్వ్యూ కాల్ లెట‌ర్ డౌన్‌లోడ్‌: 01.09.2018.
  • గ్రూప్ డిస్కష‌న్‌, ఇంట‌ర్వ్యూ తేది: 24.09.2018 నుంచి 12.10.2018 వ‌ర‌కు.
  • తుది ఫ‌లితాలు: 01.11.2018.


పూర్తి వివరాలకు ఎస్.బి.ఐ. అధికారిక వెబ్సైట్ https://bank.sbi/careers/ చూడొచ్చు.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

No comments